Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Rk Roja Sensational Comments On Cm Chandrababu And Deputy Cm Pawan Kalyan

RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్‌.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!

Published Date :March 8, 2025 , 3:30 pm
By Sudhakar Ravula
  • సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు..
  • మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్..
RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్‌.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

RK Roja: సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు.. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు.. తల్లికి వందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ దుయ్యబట్టారు.

Read Also: Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు..

నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు రోజా.. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్ధం అయింది.. అందుకే శక్తియాప్ పేరుతో యాప్ ని తెస్తున్నారు.. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు.. మహిళా భద్రత గురించి కేబినెట్‌లో ఏనాడూ చర్చించలేదు.. కానీ, గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారని మండిపడ్డారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్మతున్నారు.. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లిందని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు..? కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు..? కనీసం, సుగాలి‌ ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు.. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు అని నిలదీసిన ఆమె.. అసలు, మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కల్యాణ్‌కి లేదన్నారు. మహిళల కన్నీటి శాపనార్ధాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది.. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు.. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ది చెప్తారని హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • RK Roja

తాజావార్తలు

  • BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!

  • AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!

  • Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions