Site icon NTV Telugu

RK Roja: ప్రభుత్వంపై రోజా సంచలన వ్యాఖ్యలు..

Roja

Roja

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు… చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏమేమి హామీలు ఇచ్చారు.. ఏమేమి నెరవేర్చారో అందరికీ తెలుసన్నారు.. ప్రతీ కుటుంబం గత ప్రభుత్వ హయాంలో లబ్ది పొందారు.. కూటమి ప్రభుత్వం ఆ పార్టీ మహిళలను కూడా మోసం చేసిందని మండిపడ్డారు.. ఉగ్రవాదులకు మనకు మధ్య జరిగిన యుద్ధంలో ముందుంది నడిపిందే మహిళలు అని ప్రశంసించారు రోజా.. అయితే, సోషల్ మీడియాలో మహిళలను ఎలా టార్గెట్ చేయాలో టీడీపీ వాళ్లు నేర్పిస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. కానీ, అధికారంలో ఉన్నా.. లేకున్నా జగనన్న ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్కే రోజా.

Read Also: Vishwambara : “జై శ్రీ రామ్” నినాదంతో.. దూసుకుపోతున్న చిరంజీవి ‘విశ్వంభర’ సాంగ్..

Exit mobile version