Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain and Thunderstorms: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఉత్తరాంధ్ర జిల్లాలకు కీలక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితుల దృష్ట్యా ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
అదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని APSDMA విజ్ఞప్తి చేసింది. అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, రైతులు మరియు మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!