CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. సచివాలయంలో నామినేషన్ వేసిన అనంతరం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.. కాగా, ఏపీలో ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేశారు.. కాకినాడ నుంచి లోక్ సభ సీటు ఆశించిన సానా సతీష్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా సానా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు.. తనకు ఇచ్చినది తక్కువ కాలమే అయినా.. పార్టీ నిర్ణయాల మేరకు, కాకినాడ సమస్యలు తీర్చడానికి, పీడీఎస్ అంశంపైనా ఢిల్లీలో పని చేస్తానని వెల్లడించారు సానా సతీష్..
Read Also: No-Trust Motion: జగదీప్ ధంఖర్‌పై అవిశ్వాస తీర్మానం.. మాకే మెజారిటీ ఉందన్న కిరణ్ రిజిజు..
మరోవైపు.. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ అంటే బలహీన వర్గాలు… బలహీన వర్గాలంటే టీడీపీ… బీసీలలకు కూటమిలో ప్రాధాన్యత ఇచ్చాం… రాజ్యసభ సభ్యులు మూడిట్లో రెండు స్ధానాలకు బీసీలకు అవకాశం ఇచ్చాం అన్నారు.. 42 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో బీసీలకు పెద్ద పీట వేశాం అన్నారు.. గత ఐదేళ్లలో వ్యవస్ధలన్నీ ఛిన్నభిన్నం చేశారని మండిపడ్డారు.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.. రాజ్యసభ సభ్యులు రాష్ట్రం కోసం పని చేయాలి అని సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఇక, బీజేపీ నన్ను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని ఆర్. కృష్ణయ్య వెల్లడించిన విషయం విదితమే.. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు నా అభినందనలు తెలిపారు.. పార్టీలే నా దగ్గరకి వచ్చాయి… నేను పార్టీ మారలేదు… 2014 లో తెలంగాణ సీఎం చేస్తా అంటూ చంద్రబాబు పిలిచారు.. ఆ తరువాత వైసీపీ పిలిచి రాజ్యసభ ఇచ్చారు.. కానీ మాట్లాడాలని చూసినా అవకాశం రాలేదు నాకు వైసీపీలో… బీసీలకు అవకాశాల కోసం పోరాడాను.. అధికారం నాకు అవసరం లేదు.. రాజీనామా చేసిన తరువాతే నన్ను బీజేపీ పిలిచిందని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేసిన విషయం విదితమే..