ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్‌తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ..
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు.
టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.