Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎగవేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీలకు రావాల్సిన పన్నులు సక్రమంగా వసూలు చేస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలు, ఉద్యోగుల జీతాల సమస్యలు, పారిశుధ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నుల ఎగవేతపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పుడు, భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు చెల్లించకుండా ఉండటం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పన్ను ఎగవేతల కారణంగా పంచాయతీల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని పవన్ హెచ్చరించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై పునఃఅంచనా (రీ అసెస్మెంట్) నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారులతో (డీపీవోలు) ప్రత్యేక ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల పరిధిలోని సంస్థలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. గత 30 ఏళ్లలో పంచాయతీలకు చెందిన ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. తాళ్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్నులు వసూలు చేయడంలో జరిగిన అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నులు వసూలు చేయని సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
పరిశ్రమలు, విద్యాసంస్థల కోసం వేర్వేరు గ్రేడ్లు, పన్ను స్లాబ్‌లు నిర్ణయించాలని పవన్ సూచించారు. విద్యాసంస్థలు భారీ ఫీజులు వసూలు చేస్తూ పన్నులు చెల్లించకుండా ఉండటం సరైన విధానం కాదన్నారు. ఉచిత విద్య అందిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని పరిశీలించవచ్చని, కానీ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే సంస్థలు పన్నులు తప్పించుకోవడం అంగీకరించలేమన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని గోదావరిలోకి విడుదల చేస్తూనే స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమల నుంచి సుమారు రూ.115.57 కోట్ల పన్ను బకాయిలు, విద్యాసంస్థల నుంచి రూ.45 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సమావేశంలో వెల్లడైంది. మొత్తం మీద పంచాయతీలకు రావాల్సిన బకాయిలు రూ.160 కోట్లకు పైగా ఉన్నాయని అధికారులు వివరించారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.88 కోట్ల అవసరం ఉందని, కేవలం బకాయిల్లో సగం మొత్తం వసూలు చేసినా ఆ సమస్యను పరిష్కరించవచ్చని పవన్ పేర్కొన్నారు. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ సంస్థే సుమారు రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పన్నుల చెల్లింపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, పల్స్ సర్వే తరహాలో నాలుగు రోజులపాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. పంచాయతీలకు రావాల్సిన పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయగలిగితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.5,496 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఉద్యోగుల జీతాలు వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?