* అహ్మదాబాద్: నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరి వన్డే.. మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ప్రారంభం
* నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. మంగళ దాస్ నగర్‌లో కిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…
* అమరావతి: ఇవాళ మద్యాహ్నం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. వివిధ శాఖలపై సీఎం సమీక్ష.. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులతో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం
హైదరాబాద్: ఉదయం 11.30కి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం.. సాయంత్రం 5 గంటలకు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. 5.30కి దేవాదాయ శాఖ అధికారులతో సీఎం సమావేశం.
* ఇవాళ్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. మూడు రోజులపాటు దక్షిణాది ఆలయాలను సందర్శించనున్న పవన్.. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాల సందర్శన.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం… తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్.. హాజరుకానున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు..
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..
* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: ఇవాళ రామకృష్ణ తీర్ద ముక్కోటి
* ప్రకాశం : ఒంగోలు నుంచి కుంభమేళాకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు యాత్రను ప్రారంభించనున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ..
* పల్నాడు: నేడు ధరణి కోట లో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల తో , భవిష్యత్ కార్యాచరణ పై రాష్ట్రస్థాయి సమావేశం…
* రాష్ట్ర మంత్రులు నారాయణ… ఆనం రామనారాయణరెడ్డి లు. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు.. పరిశీలన సందర్భంగా,ఇప్పటికే తిరస్కరణకు గురైన పది మంది అభ్యర్థుల నామినేషన్లు…
* తిరుపతి: కల్యాణ వెంకటేశ్వర స్వామీ ఆలయలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… ఈనెల 18 తేది నుండి శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు
* ఎన్టీఆర్ జిల్లా: రెండో రోజుకి చేరుకున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళు
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం.
* శ్రీ సత్యసాయి : గొల్లపల్లి రిజర్వాయర్ లో జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత.
* అనంతపురం : బుక్కరాయ సముద్రం మండలం కొండమీద రాయుడు బ్రహ్మోత్సవాలో భాగంగా నేడు రథోత్సవం.
* శ్రీ సత్యసాయి : మడకశిర పట్టణ శివారులో వెలసిన శ్రీ మిట్టబండ ఆంజనేయస్వామి వారి బ్రహ్మరథోత్సవం
* భద్రాద్రి: నేడు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సహస్ర కళాశాభిషేకం
* ఖమ్మం: నేడు జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
* తిరుమల: 30 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,192 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,825 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు
* ములుగు జిల్లా: నేటి నుండి మేడారం చిన్నజాతర (మినీ మేడారం). నాలుగు రోజులు జరుగనున్న జాతర.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. మినీ జాతరకు 20 లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉదయం అన్ని అర్పట్లు చేసిన అధికారులు