Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. ప్రతి కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండేలా రూపకల్పన చేశారు. సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, మహిళా నేతలకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అలాగే 2014 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులతో పాటు ఇద్దరు సాధక్‌లకు కూడా కమిటీల్లో స్థానం కల్పించనున్నారు. ప్రతి కమిటీకి 10 నుంచి 25 మంది సాధక్‌లు సమన్వయ బృందంగా సహకరించేలా వ్యవస్థ రూపొందిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కమిటీల్లో చోటు పొందాలనుకునే నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు మరియు పత్రాలను ఈ కమిటీలు స్వీకరించనున్నాయి. అనంతరం వాటిని పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో పవన్ కల్యాణ్‌కు అందజేయనున్నారు. ఈ నివేదికలను పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ పరిశీలించిన తరువాత నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, కమిటీల సభ్యుల నియామకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్.. పార్టీ నేతలకు ఆదేశించినట్లు సమాచారం.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!