Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టండి..!
- రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టాలి..
- వైఎస్ జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి పయ్యావుల కేశవ్.. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందన్న ఆయన.. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని.. కానీ, సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్లు పెట్టడానికి కాదు అన్నారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని సూచించారు.. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని గ్రహించాలన్నారు.. శ్వేతపత్రంలో చూపిన తొమ్మిదన్నర లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చలు కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా? అని నిలదీశారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు అంటూ ఎద్దేవా చేశారు.. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నాడు.. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్లు అని హితవుపలికారు.. రాష్ట్రంలో ఈ నిమిషం వరకూ జగన్ వేసిన పోలీసులే ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయం గ్రహించాలని.. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.
Read Also: Cabinet Sub Committee: 317 జీవోపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. విచారణ చేసి నివేదిక అందజేయాలని నిర్ణయం
Also Read
తాజావార్తలు
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!