శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు. సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై పదో శాతం మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీకి ఉండాలన్నారు. అలా ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదని తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మేల్యేలను లాగితే చంద్రబాబుకి 17,18 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత హోదా కూడా చంద్రబాబుకి ఉండదు అని జగన్ చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్‌కి క్లియర్ మెసేజ్..
మరోవైపు.. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు.. ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రానికి చేసింది ఏంటి..? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ఏమైంది..? అని అడిగారు. మాట తప్పం మడం తిప్పము అన్నారు.. అమరావతి పై మాట తప్పారని లోకేష్ తెలిపారు. గత ఐదేళ్లలో గన్ పాయింట్‌లో ఆస్తులు లాక్కున్నారు.. కాకినాడ పోర్ట్ లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచామని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. అలాగే.. తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసామన్నారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం.. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకు వచ్చింది తామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పాఠశాలల్లో 12 లక్షల మంది తగ్గిపోయారు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Lenovo IdeaPad Slim 5: AI ఫీచర్లతో లెనోవా కొత్త ల్యాప్ టాప్.. ధర ఎంతంటే?