Minister Lokesh met Sales Force President: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్లో లోకేష్ భేటీ..
- సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్.. వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేష్ భేటీ..
- డాటా సేవలరంగ పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణం..
- గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Lokesh met Sales Force President: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పలు కీలక సంస్థలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ… సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు..
Read Also: Nayanthara : ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’.. బుల్లితెరపై లేడీ సూపర్ స్టార్ పర్సనల్ లైఫ్
Also Read
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
ఇక, సేల్స్ ఫోర్స్ యొక్క కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ $224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం $36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని లోకేష్ టీమ్‌కు వివరించారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా CRM సొల్యూషన్లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణ కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటుచేయండి. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు మాకు ఉపకరిస్తాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
తాజావార్తలు
-
Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!