శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ... సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు..