NTV Telugu Site icon

Minister Nara Lokesh: రెడ్‌ బుక్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేష్‌.. అది మ్యాండేటరీ..!

Lokesh

Lokesh

Minister Nara Lokesh: చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది నేను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చారు అన్నారు.. అయితే, రెడ్‌బుక్‌పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. రెడ్‌బుక్‌ మాకు మ్యాండేటరీ అన్నారు..

Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్‌..

గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌.. జోగి రమేష్ కుమారుడు ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన.. అగ్రిగోల్డ్ భూముల పత్రాలకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి.. ఆ భూములను అమ్మేశారు.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.. భవిష్యత్‌లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు..

Read Also: Team India Schedule: టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?

మరోవైపు.. జగన్ సైకోనే కాదు.. ఫేక్ కూడా అంటూ ఎద్దేవా చేశారు.. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమైంది? అని ప్రశ్నించిన మంత్రి లోకేష్‌.. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది.. బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారు.. కానీ, ఒక ఇటుక విరగలేదు.. ఇంకేం కాలేదు.. దానికి గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టింది ఎవరు జగన్ మోహన్ రెడ్డి కదా? అని ప్రశ్నించారు.. పేరు పెట్టుకుంది ఎవరు? జగన్ కాదా? అని నిలదీశారు మంత్రి నారా లోకేష్‌..