Minister Nara Lokesh: నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్… ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్… అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ పై సమీక్ష నిర్వహించిన లోకేష్ కీలక సూచనలు చేశారు..
Read Also: Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య మల్టీస్టారర్ అప్పుడే.. అనిల్ రావిపూడి క్లారిటీ
విద్యాశాఖలో గత 14నెలల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం.. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదే అన్నారు.. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తాం అన్నారు.. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది అన్నారు.. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి… దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అన్నారు..
Read Also: US visa review: యూఎస్‌లో ప్రమాదం అంచున 5.5 కోట్ల మంది.. కొంచెం తేడా అనిపించినా అంతే..
ఇక, తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం.. చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ. 325 కోట్లు విడుదల చేశాం అన్నారు లోకేష్. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి… తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేస్తున్నాం.. ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయండి అని సూచించారు.. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలి.. ఇందుకోసం శాప్ సహకారం తీసుకోండి అన్నారు.. రాజ్యాంగ దినోత్సవం నాడు అసెంబ్లీ లో విద్యార్థులచే ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి స్పీకర్ అనుమతితో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విద్యార్థులను ఎంపిక చేయాలి.. మౌలిక సదుపాయాలకు దాతల సహకారం కావాలన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల (Critical infrastructure) అభివృద్ధికి దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తిగల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందించాలని సూచించారు మంత్రి నారా లోకేష్..
