Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్‌పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు.. అయితే, ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు 48 వేల కోట్లు.. అక్కడికి చేరాక అది డబుల్ అవుతోందన్నారు.. మమ్మల్ని చాలా మంది తప్పుదోవ పట్టించాలని చూసారు.. అక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఒక షిప్టు లేకుండా చేసి మరీ పీడీఎస్ రైస్ తరలింపుకు సిద్ధమయ్యారు.. బియ్యం అక్రమ రవాణ ఆర్గనైజ్డ్ క్రైం. ఇక నుంచి బియ్యం స్మగ్లింగ్ ను ఆర్గనైజడ్ క్రైంగా కేసులు నమోదు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
ఇక, పీడీ యాక్ట్ క్రింద రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిని తీసుకువచ్చే చట్టం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు నాదెండ్ల.. కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ రవాణా కేసులో 28 కంపెనీలు ప్రమేయం వుంది. వీరంతా ముఠాగా ఏర్పడి దక్షిణ ఆఫ్రికాకు స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు.. నేను ఇచ్చిన సమాచారం, నా ఆదేశాల మేరకే కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకను కలెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు.. షిప్ ను కూడా సీజ్ చేస్తాం. షిప్ ను సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.. మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్న.. మంత్రి పయ్యావులు కేశవ్ వియ్యంకుడి షిప్ వివరాలు ఇస్తే వాటిని కూడా తనిఖీ చేస్తాం.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు.. ఇక, నేను మంత్రిగా బాధ్యలు చేపట్టిన ఐదు నెలల్లో 6 ఏ కేసులు 1066 నమోదు చేశాము. ఇది రికార్డుగా పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.