Minister Nara Lokesh: ఇక, మేనేజ్‌మెంట్ కమిటీలకు స్కూళ్ల పనులు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్ఎంసీలకు అప్పగించండి..
- అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3స్టార్ కు చేర్చేలా చర్యలు చేపట్టండి..
- ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టాలి..
- ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించండి..
- పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించి త్వరిగతిన పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైబడి విద్యార్థులున్న పాఠశాలలు 60 ఉన్నాయని.. ఆ స్కూళ్లలో 5స్టార్ సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలన్నారు మంత్రి లోకేష్.. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో సీట్ల కోసం పోటీ ఉందని.. ఇది మంచి పరిణామం అన్నారు లోకేష్.. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, తాగునీరు, టాయ్‌లెట్లు, పెయింట్స్, బల్లల ఏర్పాటు వంటి పనులను ఎస్ఎంసీలకు అప్పగించాలని… మోడల్ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.143.27 కోట్లు అవసరం అన్నారు… ఈ పనులను మాత్రం రాష్ట్ర పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టండి.
Read Also: Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఈ ఏడాది మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.571.11 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. వివిధ విభాగాల ద్వారా నిధులను సేకరించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయండి. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇక, ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఎన్‌రోల్‌మెంట్ పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించండి.. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తాం అన్నారు.. ఈసారి 10 శాతం అడ్మిషన్ల పెంపుదల లక్ష్యంగా పనిచేయండి. పాఠశాలల్లో డ్రాపవుట్స్ ను జీరో స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!