Site icon NTV Telugu

Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్‌ 2లు కూడా వెళ్లిపోయారు.

Minister Parthasarathy

Minister Parthasarathy

Minister Kolusu Parthasarathy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్‌ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.. ఇక, నీతిఆయోగ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడితే.. దానిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఒక వ్యక్తి మూర్ఖత్వం మూలంగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు.. చంద్రబాబు నాయుడు మాటలపై దమ్ముంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్‌ చేశారు.. రాష్ట్రాన్ని అగాధంలోకి వైసీపీ నెట్టింది.. కూటమి 7 నెలల పాలనపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కొలుసు పార్థసారథి.. అమరావతితో సహా మిగిలిన ప్రాజెక్టులకు 31 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి.. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అని వెల్లడించారు.. వైసీపీ మొదటి ఏడు నెలలు ఏమి చేసింది..? అని నిలదీశారు.. అన్న క్యాంటీన్లను కూడా వైఎస్‌ జగన్‌ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..

Read Also: Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!

Exit mobile version