Site icon NTV Telugu

Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ కేసు.. కీలక అంశాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర..

Kollu

Kollu

Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. ఈ కేసులోని పరిణామాలపై స్పందించిన ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఒక నివేదిక ఇచ్చింది.. నకిలీ మద్యం తయారీకి సంబంధించి సమాచారం వచ్చింది. నకిలీ మద్యం సఫ్లయ్‌ చేసే వ్యాన్ లు కూడా ఐడెంటిపై చేసాం.. సంబంధిత అధికారులు దాడులు చేశారు. 30 క్యాన్ ల స్పిరిట్ ఉంది… వెంటనే విచారణకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దెపల్లి జనార్దన్ రావ్ కనుసన్నల్లోనే నకిలీ మద్యం వ్యవహారం జరిగిందని తెలిపారు కొల్లు రవీంద్ర.. తమిళనాడు, ఒడిశాకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాస్ కూడా ఉన్నారు అని వెల్లడించారు.

Read Also: Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది

రాక్ స్టార్, ఆంధ్ర వైన్స్.. రెండు కంపెనీలు ప్రధానంగా ఉన్నాయి.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావ్ కు షాపులు ఉన్నాయి అని పేర్కొన్నారు కొల్లు రవీంద్ర.. ఎక్సయిజ్ శాఖ ప్రస్తుతం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం… అన్ని బ్రాండ్స్ మద్యం.. ప్రస్తుతం అందుబాటులో ఉంది. నకిలీ మద్యాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో డిస్టీలరీస్ స్వాధీనం చేసుకున్నారన్న ఆయన.. సీఎం చంద్రబాబు నకిలీ మద్యం పై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.. జయచంద్రా రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు..

ఇక, వైఎస్‌ జగన్ రాజకీయ జీవితం శవ యాత్రలతో స్టార్ట్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు కొల్లు రవీంద్ర.. 600 మంది తన తండ్రి (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి) మరణం తట్టు కోలేక చనిపోయారని జగన్ శవ యాత్రలు చేశారన్నారు.. అయితే, నకిలీ మద్యంపై విచారణ జరుగుతోంది… దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.. వైఎస్‌ జగన్ దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారు.. టెలీ కాన్ఫెరెన్స్‌ పెట్టి.. ఎవరు ఎలా చనిపోయినా.. నకిలీ మద్యం వల్లే అని ప్రచారం చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..

Exit mobile version