Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు…
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు..
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు..
ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీల ఫిష్ వినియోగిస్తున్నారని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న ఆయన.. వినియోగం తక్కువగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.