విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి.
అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు పొడిగించారు. ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు.