AP Liquor Sales: ఏపీలో లిక్కర్ అమ్మకాల జోరు
- రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా లిక్కర్ అమ్మకాలు..
- అక్టోబర్ 16 నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు..
- డిసెంబర్ 9వ తేదీ వరకు.. 4వేల 677 కోట్ల మద్యం వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు.. 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల కేసుల మద్యం అమ్మారు. 19 లక్షల 33వేల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించగా.. వాటికి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచింది.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు అయిన విషయం విదితమే..
Read Also: Trinamool Congress: ‘‘బాబ్రీ మసీదుని నిర్మిస్తాం’’.. తృణమూల్ నేత వ్యాఖ్యలతో వివాదం..
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి.. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ వాటిని ప్రైవేటు వారికి టెండర్ల రూపంలో ఇచ్చేలాగా నిబంధన తీసుకొచ్చింది.. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం చేకూరడంతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి రాష్ట్రంలో అవకాశం లభించింది మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం 3300 కి పైగా దుకాణాలను టెండర్ల రూపంలో కేటాయించ టంతో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది అక్టోబర్ 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి.. నిబంధన ప్రకారం షాపుల ఏర్పాటు చేయటంలో పాటు విధంగా కొందరు రాజకీయ నేతలు ఒత్తిడితో ఆలస్యంగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే కమిషన్ అంశానికి సంబంధించి 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. 20 శాతం ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం దుకాణాలు టెండర్లు పాడుకున్న యజమానులు చెబుతున్నారు ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా అటు మద్యం దుకాణాలు బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 4677 కోట్ల ఆదాయం వచ్చింది. 6163508 మద్యం కేసులు,
1933560 కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయి.
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!