AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 20 మంది నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. గగరా ధరణి అనే వ్యక్తి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ గుర్తులతో పాటు పార్టీ నాయకులు కళ్యాణం శివ శ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయం పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
నిందితుడు ధరణి గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేసినట్లు సమాచారం. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు నమ్మించి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల పేర్లు, కార్యాలయ గుర్తులను దుర్వినియోగం చేసిన ఈ వ్యవహారం జనసేన రాష్ట్ర కార్యాలయం దృష్టికి చేరడంతో పార్టీ నాయకులు స్పందించారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కళ్యాణం శివ శ్రీనివాస్ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరును, నాయకుల పేర్లను ఉపయోగించి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
- AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Cyclone Threat : మురసు, అర్నబ్ తర్వాత మరో అల్పపీడనం.. ఏపీకి టెన్షన్
- Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
ఇక, ఫిర్యాదు స్వీకరించిన మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రూ.7 కోట్ల వసూళ్ల వ్యవహారంలో బాధితుల వివరాలు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, డబ్బుల లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీ పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ మోసం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Jammu Kashmir: జమ్ము కశ్మీర్లో తీవ్ర కలకలం.. అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం..
-
AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
-
Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Google Gemini Memory Summary: గూగుల్ జెమినై యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..! ఇక ఆ టెన్షన్ లేదు..
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!