NTV Telugu Site icon

Minister Vangalapudi Anitha: జగన్‌ అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.. అన్నీ కుంటిసాకులే..

Anitha

Anitha

Minister Vangalapudi Anitha: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు.. డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడన్న ఆమె.. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అన్నారు.. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్.. ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read Also: Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..

ఇక, డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జగన్ చేశాడని దుయ్యబట్టారు అనిత.. వైఎస్‌ జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబరుగా దళితులకు అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు.. హిందూ దళితురాలైన నాకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే.. నాడు రాజకీయ రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనే.. అంటూ మండిపడ్డారు.. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందన్న ఆమె.. దేశాన్ని కించపరుస్తున్న జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు..? అని ప్రశ్నించారు.. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేయాలనే పరిస్థితిని జగనే తెచ్చుకున్నాడు.. జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా? నిన్న జగన్ పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా లేక గృనిర్బంధo చేశామా? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే తనకే అది జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్ ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.