Home Minister Anitha: గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు.. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి..? అని నిలదీశారు.. అయితే, వైసీపీ హయాంలో కంటే మా హయాంలోనే క్రైం రేటు తగ్గిందన్నారు.. కానీ, అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు..
Read Also: Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ఆప్ సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్
దిశ చట్టానికి అసలు చట్టబద్ధతే లేదు అని దుయ్యబట్టారు హోం మంత్రి అనిత.. నిర్భయ చట్టం ఉన్నా.. దిశ లేని చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు.. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నాం అన్నారు.. అయితే, ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. కానీ, పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు.. వైసీపీ హయాం నాటిదే అని విమర్శించారు.. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని గుర్తుచేశారు.. ప్రతిపక్షాలు ముచ్చుమర్రు కేసు విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.. 3 సంవత్సరాల బాలిక చనిపోవడం దారుణమైన విషయం.. ముచ్చుమర్రు కేసు విషయంలో నిందితులకు శిక్ష వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
Read Also: Realme Narzo 70 Curve: రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఎక్కువ, ధర తక్కువ!
2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో మహిళల మీద జరిగిన దాడులు అందరు చూశారన్నారు అనిత.. అప్పటి సీఎం ఇంటి పక్కనే అత్యాచారం చేసి హత్యలు చేసినా నిందితులను పట్టించుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు.. కానీ, కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.. మొత్తంగా గత ప్రభుత్వ వైఫల్యాలే నేరాలు పెరగడానికి కారణం అన్నారామె.. గంజా అరికట్టకపోవడం వల్లే నేరాలు పెరిగాయన్న మంత్రి అనిత.. డోర్ డెలివరీ చేసిన వాళ్లు కూడా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. గంజా అరికట్టడానికి టాస్క్ పోర్స్ వేశామని వెల్లడించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..