చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. తన నార్జో 70 సిరీస్‌లో ‘నార్జో 70 కర్వ్’ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. డిసెంబర్ చివరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ అందించినట్లు తెలుస్తోంది. నార్జో 70 కర్వ్ ఫీచర్లకు సంబంధించి రియల్‌మీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా.. సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2024 డిసెంబర్ చివరలో రియల్‌మీ నార్జో 70 కర్వ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభించబడుతుంది. ఈ ఫోన్ ధర రూ.15,000 నుండి రూ.20,000 వరకు ఉండవచ్చు. నార్జో సిరీస్‌లోని ఇతర మోడళ్ల ధర కూడా రూ.20,000 పరిధిలో ఉన్నాయి. నార్జో సిరీస్‌లో ఇది నాల్గవ ఫోన్. రియల్‌మీ నార్జో 70, రియల్‌మీ నార్జో 70 ప్రో, రియల్‌మీ నార్జో 70 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ఇదివరకే రిలీజ్ అయ్యాయి.
Also Read: Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
రియల్‌మీ నార్జో 70 కర్వ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్‌తో ఈ స్క్రీన్ సొంతం. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మీ యూఐతో పని చేస్తుంది. ఇది ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది. 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను వెనకాల ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 16 ఎంపీతో కూడిన కెమెరాను ఇ్వనున్నారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వనున్నారు.