Heavy Rainfall Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, కాస్త తెరపి ఇచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడుతుందని.. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది..
Read Also: Uttarakhand: ఇలా తయారయ్యారేంట్రా.. తప్ప తాగి నన్ను రే*ప్ చేయండంటూ యువతి హల్ చల్..
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉండగా.. రేపు అనగా ఈ నెల 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఇక, 22వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది వాతావరణ శాఖ..