NTV Telugu Site icon

Union Minister Murugan: కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు.. పోలవరం బాధ్యత మాదే..

Union Minister Murugan

Union Minister Murugan

Union Minister Murugan: కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్‌.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు.. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.. బడ్జెట్‌లో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. దేశాభివృద్ధికి ఏపీ తోడ్పాటు ఇస్తుందన్నారు..

Read Also: Raviteja: మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ టీజర్ ఎప్పుడో తెలుసా..?

ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమన్నారు మురుగన్‌.. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉందన్న ఆయన.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50,474 కోట్ల మేర లబ్ది చేకూర్చాం. ఏపీకి ప్రత్యేక ఆర్థిక చేయూత ఇచ్చే క్రమంలో అమరావతికి రూ. 15 వేల కోట్ల మేర నిధులు కేంద్రం ఇప్పించనుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంగా చెబుతున్నాం అన్నారు.. పోలవరం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. వివిధ కారిడార్ల ద్వారా ఏపీలో అభివృద్ధి చేపట్టడం.. ఉపాధి కల్పించడం వంటివి చేస్తాం. వెనుకబడిన జిల్లాలకు సాయం కొనసాగిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాం. వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తాం అన్నారు.

Read Also: Gold PriceToday: షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?

ఇక, డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయనున్నాం అన్నారు మురుగన్.. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆక్వా రైతులకూ కేంద్రం అందచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. ఏపీ నుంచే 60 శాతం రొయ్యల ఎగుమతులు జరుగుతున్నాయని వెల్లడించారు.. రొయ్యల సాగు మొదలుకుని, ఎగుమతుల వరకు నాబార్డు ద్వారా ఆక్వా రైతులకు ఆర్థిక చేయూత అందించేలా చర్యలు.