Site icon NTV Telugu

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. మరో లిస్ట్‌ విడుదల..

Nominated Posts

Nominated Posts

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్‌ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్‌ విడుదల చేశారు..

Read Also: Single: ఈ సింగిల్ గాడి దెబ్బకు షోస్ డబుల్

తాజా జాబితాలో నామినేటెడ్‌ పదవులు పొందినవారు వీరే..
1. ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు – డా. జెడ్. శివ ప్రసాద్ (టీడీపీ)
2. ఏపీ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC)-ఎస్. రాజశేఖర్ (టీడీపీ)
3. ఏపీ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్-సుగుణమ్మ (టీడీపీ)
4. ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు -వెంకట శివుడు యాదవ్ (టీడీపీ)
5. ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు-వలవల బాబ్జీ (టీడీపీ)
6. ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC)- బురుగుపల్లి శేషారావు (టీడీపీ)
7. ఏపీ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ – పితల సుజాత (టీడీపీ)
8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- దివాకర్ రెడ్డి (టీడీపీ)
9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA)- వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (టీడీపీ)
10. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS)- డా. రవి వేమూరు (టీడీపీ)
11. ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మలేపాటి సుబ్బా నాయుడు (టీడీపీ)
12. ఏపీ ఎస్సీ కమిషన్ – కె.ఎస్. జవహర్ (టీడీపీ)
13. ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య – పెదిరాజు కొల్లు (టీడీపీ)
14. ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ – పేరేపి ఈశ్వర్ (టీడీపీ)
15. ఏపీ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ – మల్లెల ఈశ్వరరావు (టీడీపీ)
16. ఏపీ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య – ఆకాసపు స్వామి (టీడీపీ)
17. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) – లీలకృష్ణ (జనసేన పార్టీ)
18. ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ – రియాజ్ (జనసేన పార్టీ)
19. ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ – డా. పసుపులేటి హరి ప్రసాద్ (జనసేన పార్టీ)
20. ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ – సోల్ల బోజ్జి రెడ్డి (భారతీయ జనతా పార్టీ)
21. ఏపీ మహిళా కమిషన్ – డా. రాయపాటి శైలజా (అమరావతి జేఏసీ)
22. ఏపీ ప్రెస్ అకాడమీ – ఆలపాటి సురేష్ (అమరావతి జేఏసీ)

Exit mobile version