Single: ఈ సింగిల్ గాడి దెబ్బకు షోస్ డబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే సినిమా, ‘సింగిల్’తో పోలిస్తే బాగా వెనకబడిపోయింది. ‘సింగిల్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా షోలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా ముందుగా అనుకున్న షోల కంటే రెట్టింపు షోలు నడుస్తున్నాయని సమాచారం.
Also Read: Akanda 2 : వెయ్యి మందితో బాలయ్య యాక్షన్ సీన్..?
Also Read
భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కెమిస్ట్రీ బాగా కుదిరినందున, వీరిద్దరి కామెడీ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 11 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని కోట్లు సాధించడం మామూలు విషయం కాదు. నిజానికి, ఈ సినిమా కేవలం 6 కోట్ల మార్కెట్‌తో బరిలోకి దిగింది. రెండు రోజుల్లోనే సినిమా కొనుగోలు చేసిన వారందరూ సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
- Tags
- single movie
- Sree Vishnu
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!