AP Employee unions: ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం ఇస్తున్నాయి… ఒకటో తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీజేఏసీ నాయకులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పని చేయడం లేదని, సంవత్సర కాలం ఎదురుచూసాం.. ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు.. పీఆర్సీ సవరణకు రెండు సంవత్సరాలైనా కమిషనర్ ను నియమించకపోవడం పై ఉద్యోగ సంఘాలు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జెఏసీ నేతలు అంటున్నారు..
Read Also: Tollywood : లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్‌లు, ధర్నాలు అంటూ ఉద్యమ బాట పట్టారు.. ప్రమోషన్లు ఇవ్వడం లేదని, డీఏలు, సరెండ్ ల అంశంలోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడం పై ఇప్పటికే ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యమ బాట పట్టింది… ప్రభుత్వ పరిధిలో ఉన్న పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలలోను, నాలుగు వర్కుషాపులలో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.. ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధర్నాలు జరిపారు… ఏకంగా సీఎం చంద్రబాబు అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కోరారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ విజయవంతం కావాలంటే 3వేల బస్సులు కొనుగోలు చేయాలి/10 వేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.. పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నారు.
Read Also: Mrunal Thakur : 6ఏళ్లుగా ఒక్క హిట్ లేదు.. అయినా ఆఫర్స్ తగ్గడం లేదు
పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జెఏసీ నాయకులు.. పంచాయితీ కార్యదర్శులు సైతం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీఎన్జీజీజీవోతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.. అటు చేసే టైం లేక… ఉదయం నుంచి గ్రీన్ అంబాసిడర్ ల కోసం ఎదురు చూడలేక నానా అవస్థలు పడుతున్నాం అంటున్నారు. వాళ్లకి ఇచ్చే రెండు వందలకు పని చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్బారని అంటున్నారు.. అలాగే ప్రమోషన్ల విషయంలోనూ తమ గోడు పట్టించుకోవాలని అంటున్నారు.. అలా పట్టించుకుని ప్రమోషన్లు ఇవ్వకపోతే ఉద్యమ బాట పడతామని అంటున్నారు.. మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నవే అడుగుతున్నాం, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన చేయడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. ఏపీలో ఉద్యోగులు సంఘాల వారోగా ఒక తాటి మీదకు వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ, రెండు నెలల టైం పెట్టడం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..