AP Legislative Council: శాసన మండలిలో వివిధ అంశాలపై చర్చ సాగుతోన్న తరుణంలో కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య కస్సు బస్సు వాతావరణం కనిపించింది.. ఇక, మండలిలో కేసులపై చర్చ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి అన్నారు. కొందరు వ్యక్తులు తప్పులు చేయకపోయినా కేసులు పెట్టించుకుని జైళ్లో ఉండాల్సి వస్తుంది.. వాళ్ళు జైళ్లో ఉన్న సమయాన్ని ఎలా తిరిగి ఇవ్వగలం..? అని ప్రశ్నించారు. చట్టాన్ని తమ చుట్టాల్లా ప్రభుత్వాలు వాడుకుంటే ఇబ్బందులు సాధారణ వ్యక్తులు పడాల్సి వస్తుందన్న ఆయన.. కొందరు విద్యార్ధులపై కేసులు నమోదైన సమయాల్లో పాస్ పోర్ట్ ల కోసం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.. రాజకీయ కక్ష్యలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యులు జీవితాలు తారుమారు అవుతున్నాయి.. తప్పుడు కేసులపై చూస్తూ కూర్చుంటే సామాన్యులకు అండగా ఉండలేం.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని సూచించారు నాగబాబు..
Read Also: Jyothi Poorvaj : సీనియర్ ఆంటీ జ్యోతి పుర్వాజ్.. హాట్ ఫోజులతో అదరగొడుతుందిగా
అయితే, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పెట్టిన కేసులు సంఖ్యను కూడా చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం.. మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులపై కూడా కేసులు పెట్టారు.. మా ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు అని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం మహిళలు ఎవరైనా పోస్టింగులు పెట్టినా వారిని కూడా వదల్లేదు.. అమరావతి రైతులపై పెట్టిన కేసులకు లెక్క లేదు. నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు.. నేను ఇప్పటికీ కోర్టుకు వెళ్తున్నానని వెల్లడించారు.. ఎవరు నిరసనలు చేసినా అరెస్టులు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో మా మీద అక్రమ కేసులు పెట్టారు రద్దు చేయాలని 3116 మంది మా దృష్టికి తెచ్చారు.. పాస్ పోర్ట్ ల విషయంలో కూడా చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.. వాళ్లు ఉద్యోగాలకు కూడా అనర్హత పొందుతున్నారు.. మా ప్రభుత్వం అక్రమ కేసులు ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు హోం మంత్రి అనిత…
ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా .. ఇప్పటికీ ఆ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు.. అవసరం అయినప్పుడు మాట్లాడితే ఫర్వాలేదు.. కానీ, ఇంకా గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ఫైర్ అయ్యారు.. రాజకీయ ఆరోపణలు చేయటం తప్ప.. ఈ ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు.. ఇది సాంప్రదాయం కాదు.. దీని మీద మా నిరసన తెలియజేస్తూ ఈ ప్రశ్న నుంచి వాకౌట్ చేస్తున్నాం అంటూ.. శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు బొత్స సత్యనారాయణ..