Ditwah Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను వేగంగా తీరం వైపు చేరుకుంటోంది. చెన్నైకి తూర్పున కేవలం 50 కిలోమీటర్లు, తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతోంది. వాతావరణ శాఖ అర్ధరాత్రికల్లా ఇది మరింత దగ్గరగా, తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకూ చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు జిల్లాల్లో వర్షాలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వర్షపాతం నమోదవుతోంది.
Read Also: T-Safe : తెలంగాణ పోలీసుల ముందడుగు.. మహిళా భద్రతకు ‘టీ-సేఫ్’ విప్లవాత్మక విధానం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను బలహీన పడుతుంది.. ఈ వాయుగుండం పశ్చిమ మధ్య మరియు దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం, తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చాలా దగ్గరగా కదులుతోంది. గత ఆరు గంటల్లో ఇది 3 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 140 కిలో మీటర్లు, కడలూరుకు 160 కిలో మీటర్లు, నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది… ఈ తీవ్ర వాయుగుండం కేంద్రం తీరానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
Read Also: T-Safe : తెలంగాణ పోలీసుల ముందడుగు.. మహిళా భద్రతకు ‘టీ-సేఫ్’ విప్లవాత్మక విధానం
ఈ దిత్వా తుపాను అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగి.. ఆ తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి కొన్ని గంటల్లో చెన్నై తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో అత్యంత చేరువ కానుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.. ఇక ఈ సాయంత్రం 5 గంటల వరకు కొడవలూరు (నెల్లూరు): 38.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నెల్లూరు: 36.7 మి.మీ, తడ (తిరుపతి): 33.5 మి.మీల వర్షపాతం నమోదు అయ్యింది.. అయితే, దిత్వా తుపాను బలహీన పడిన కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు.. మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి నేపథ్యంలో రైతులు, మత్సకారులు, తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.