Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Akwan: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది.. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ గమనం, తీవ్రత, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదలిక
అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్వాన్ తుఫాన్ ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈరోజు సాయంత్రానికి తుఫాన్ తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వివరించారు. అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు.
Also Read
- ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
- Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలి
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని తాకుతున్న మూడో తుఫాన్ ఇదని పేర్కొన్నారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వాటి ప్రభావం ప్రజలపై పడకుండా అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు నేరుగా సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించాలి
ఎంతటి పెద్ద విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉన్నారనే భరోసా కల్పించాలని చంద్రబాబు సూచించారు. తుఫాన్ కారణంగా చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా వెంటనే తొలగించి రహదారులను పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను కూడా వేగంగా చేపట్టాలని తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని రియల్ టైమ్‌లో అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా అక్వాన్ తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తాజావార్తలు
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
-
Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!