NTV Telugu Site icon

CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్‌కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు

Cm Chandrababu

Cm Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. ‘సీఎం సర్.. ఆల్ ది బెస్ట్’ అంటూ విష్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు ప్రయాణం కానున్నారు. రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరుకానున్నారు. పెట్టుబడులకు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా.. ఏపీ సీఎం అండ్ టీం దావోస్ టూర్ జరగనుంది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం మూడు రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఏపీకి పెట్టుబడులు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా ఈ టూర్ జరగనుంది. మొదటి రోజు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారితో సమావేశం అవుతారు. తర్వాత పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగనుంది.

Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..

రెండో రోజు దావోస్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించిన చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్ జి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్ మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే చర్చ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

మూడోరోజు కూడా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు ఉంటాయి. ఏపీకి ఉన్న పెట్టుబడుల అవకాశాలు సీఎం అండ్ టీం వివరిస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు భారీ పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఈడీబీ అధికారులు బృందం ఉంటుంది. ఏపీకి ఉన్న తీరరేఖ మౌలిక సదుపాయాలు, నదులు, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా వివరించి బాబు అండ్ టీం దావోస్ పర్యటనలో పెట్టుబడులపై దృష్టి పెట్టనుంది.

Read Also: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌