CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warns Collectors: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అంశంపై ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ వివరణను ప్రజలకు అర్థమయ్యేలా అద్భుతంగా వివరించారని సీఎం ప్రశంసించారు. తమీమ్ అన్సారియా, భరణిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇక, ఏడో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు స్థాయిపై అధికారులు నివేదికను ప్రదర్శించారు. గత కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాల్లో 57 నిర్ణయాలు అమలు చేసినట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన నాలుగు నిర్ణయాల్లో రెండు పూర్తిగా అమలు చేశారని తెలిపారు. అలాగే నెట్‌జీరో కాన్సెప్ట్‌ను అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అమలు చేసినట్లు అధికారులు వివరించారు.
మరోవైపు, అధికారులు సరైన సన్నద్ధతతో సమావేశాలకు రాకపోతే వారి పనితీరు బయటపడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే వారిని పక్కనపెడతానని స్పష్టం చేశారు. ఈ నిబంధన అధికారులు మాత్రమే కాకుండా మంత్రులకు, తనకు కూడా వర్తిస్తుందని అన్నారు. నెట్‌జీరో కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. సమావేశంలో కార్యదర్శి సత్యనారాయణ మరోసారి మాట్లాడేందుకు ప్రయత్నించగా, “మీ టైం అయిపోయింది” అంటూ సీఎం స్పష్టం చేశారు. సమయపాలన పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందేనని, కొన్ని సందర్భాల్లో తాను కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు అన్నారు. దీపం ట్రాన్స్ఫర్ సబ్సిడీ విషయంలో కలెక్టర్లు వేస్ అండ్ మీన్స్ పరిస్థితిని పరిశీలించి నిధులు ఇస్తామని చెప్పడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. తేదీ ప్రకటించిన తర్వాత ఆ రోజుకు నిధులు సమకూర్చడం, అవసరమైతే అప్పు చేయడం వంటి చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యతేనని, నిర్ణయం ప్రకటించిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read
- AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
- CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
నేచురల్ ఫార్మింగ్ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్సీలకు అందుతున్న ప్రయోజనాలను ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో మాట్లాడాలని, అవసరమైతే సీఎంవోకు రావాలని అధికారులకు చెప్పారు. రెండేళ్లు గడిచినా అమలు చేయలేకపోతున్న పరిస్థితిని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, మరుసటి రోజు సాయంత్రంలోగా సంబంధిత ఉత్తర్వులు తన టేబుల్‌పై ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రతి పనికీ సీఎంవోను ఆశ్రయించి బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం కలెక్టర్ల బాధ్యత అని తేల్చిచెప్పారు. సీఎస్, మంత్రులు, అధికారులు లేదా సీఎంవోలో ఎవరినైనా సంప్రదించండి.. కానీ ప్రజల పనులు మాత్రం పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?