AP Pensions: పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?
- జులై 1వ తేదీన పింఛన్ల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం..
- సోమవారం ఉదయం 6 గంటలకే మొదలుకానున్న పింఛన్ల పంపిణీ..
- కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు..
- మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1వ తేదీన (సోమవారం) పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది.. ఇప్పటికే పింఛన్ల పంపిణీకి సర్వం ఏర్పాటు చేసింది.. నిధులను విడుదల చేయడంతో.. రేపు ఆదివారం కావడం.. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుకానుండడంతో.. బ్యాంకుల నుంచి డబ్బులను కూడా డ్రా చేసిపెట్టుకున్నారు.. ఎన్నికల హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జులై 1వ తేదీ పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పింఛన్ల పంపినీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
Read Also: Car Prices: భారీగా తగ్గిన కార్ల ధరలు..రూ.82,000 వరకు డిస్కౌంట్!
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
అయితే, మేం అధికారలోకి వస్తే పెన్షన్‌ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్‌పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే కావడం మరో విశేషం..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?