TDLP Meeting: నిత్యం ఏదోఒక కార్యక్రమాలు.. సమావేశాలు.. రివ్యూలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుదిరినప్పుడల్లా పార్టీ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తున్న విషయం విదితమే.. ఇక, ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్‌ల ముందస్తు రిజర్వేషన్
అయితే, మద్యం షాపులు, ఇసుక సహా ఇతర కీలక అంశాలపై ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు.. దానిపై మరింత అవగాహన కల్పించనున్నారా? అనే చర్చ సాగుతోంది.. మొత్తంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. ఏపీలో మద్యం టెండర్లు, ఇసుక పాలసీలో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరి ఎమ్మెల్యేల ప్రవర్తన ఉందంటూ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇసుక, మద్యం విషయాల్లో పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని పార్టీ అంతర్గతంగా కొంత చర్చ జరుగుతోందట.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తు్న్నారని చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నట్టు పార్టీలో చర్చ సారుగుతోంది.. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఇదే విషయంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.. ముఖ్యంగా రాయలసీమలోని కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహారంపై సీఎం గుర్రుగా ఉన్నారనే చర్చసాగుతోంది.. మొత్తంగా ఇవాళ్టి సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.. ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు..