NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. కలెక్టర్లు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తెల్వారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. ఇక, నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..

Read Also: Rail Bomb Threat: టైమర్ బాంబుతో పేల్చేస్తామంటూ.. ముంబై – హౌరా మెయిల్‌కు బెదిరింపులు

ఇక, టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.. పర్యవేక్షణ ఉంచాలి. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి.. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు.. చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలి.. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి.. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలి.. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని తెలిపారు..

Read Also: Jharkhand: జార్ఖండ్‌లో దారుణం.. దుర్గాపూజకు వెళ్లి వస్తున్న ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం..

సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని సీఎంకు తెలియజేశారు అధికారులు.. ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు.. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ టీమ్స్ సిద్ధంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు..