NTV Telugu Site icon

CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – 2047’ డాక్యుమెంట్‌పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనం స్వర్ణాంధ్ర – 2047తో ముందుకెళ్లాలి.. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని చెప్పారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలే ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Mumbai 26/11 attack: భారత్‌కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..

అనివార్య పరిస్ధితుల్లో 1999లో ధరలు పెంచాం.. ప్రజలు నమ్మారు‌.. మార్చక్కర్లేని విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు.. అధికార యంత్రాంగం మొత్తం నిర్వర్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు తీవ్రస్థాయికి చేరాయి.. తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆస్ట్రేలియన్లను కంగారెత్తించిన భారత బౌలర్లు

సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్ధిక అసమానతల పైన ప్రత్యేకంగా ఆలోచించాలి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఏపీగా మారుతామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తేనే మోదీ వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు. పది సూత్రాలతో అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీ ఉద్యోగాలు రావాలని చెప్పారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్దికి ప్రధాన్యత ఇచ్చాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గడానికి టెక్నాలజీ సపోర్టు తీసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు. తాను అనునిత్యం ఒక స్టూడెంట్‌ని.. అది నా బాధ్యత.. చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలను ఒక క్యాపిటల్‌గా తీసుకుని.. షార్ట్, లాంగ్, మిడిల్ టర్మ్‌లలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.