NTV Telugu Site icon

AP CM Chandrababu: జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలి..

Chandrababu Naidu

Chandrababu Naidu

జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు. ఉదయం ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపానని పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీరులో బలమైన పార్టీగా బీజేపీ అవతరించింది.. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నాని తెలిపారు. బీజేపీ అధిష్టానం నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నారు.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం పెరిగింది.. హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్ ఎన్నికల్లో ఫలితాలే దీనికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు.

CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ ఎన్నికల ఫలితాలు చరిత్రాత్మకం.. త్వరలోనే భారత దేశం 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో భాగస్వామ్యమై దేశాభివృద్ధిలో తామూ ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. ఎవరి పరిపాలన వల్ల మంచి జరుగుతుందో, విజన్ వల్ల కలిగే లాభాల పట్ల ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. రానున్న రోజుల్లో ఒక్క ఏపీలోనే రూ.75వేల కోట్ల ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారన్నారు. దక్షిణ భారత దేశంలో బెంగుళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బులెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి.. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు అభినందించటం తన బాధ్యత అని సీఎం తెలిపారు.

EV Charging Rates : ToD టారిఫ్ సిస్టమ్ ప్రకారం తెలంగాణలో EV ఛార్జింగ్ రేట్లు

అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా, ప్రజా చైతన్యం ఎంతో అవసరం.. కేంద్ర పథకాలను త్వరితగతిన అందిపుచ్చుకుంటూ వెళ్తే.. రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ నెంబర్1 గా ఎదుగుతామని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటం మంచి పరిణామం కాదు.. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్ర పన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. మరోవైపు.. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రూ.400 కోట్లు పైన విరాళాలు ఇచ్చారు.. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఇంత కన్నులపండువగా గత ఐదేళ్లలో ఎప్పుడైనా జరిగాయా? అని అన్నారు. ప్రసాదాలు మొదలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.. తమకు ఎవరి వల్ల లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తే.. అది సుస్థిర ప్రభుత్వానికి నాంది పలుకుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Show comments