CM Chandrababu: పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం కోటప్పకొండ త్రికోటేస్వర స్వామిని దర్శించుకోనున్నారు.. ఈ నేపథ్యంలో యల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. మొత్తంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.. నిజానికి జనవరి ఒకటో తేదీన, నూతన సంవత్సర వేడుకల్లో భాగంతో పాటు ,పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారని , ముందుగా ప్రచారం జరిగింది.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
Read Also: Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
జనవరి 1వ తేదీన, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ,పులిపాడు గ్రామంలో కాకుండా, నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారు అన్న ప్రచారం జరిగింది.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి, బీసీ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో, నాయకులు కార్యక్రమాన్ని అక్కడికి మార్చారనేది జరిగిన ప్రచారం.. అక్కడే గ్రామ సభతో పాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని ,అధికారులు భావించారు.. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి మళ్లీ ఈరోజు మరొక మార్పు జరిగింది.. తాజాగా నరసరావుపేట మండలం ,ఎలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అక్కడే పెన్షన్ల పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.. దీనికి తోడు జనవరి ఒకటో తేదీనకాకుండా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 ఉదయాన్నే ,పూర్తి చేయాలన్న ఆలోచనతో, అటు సీఎం కార్యాలయం ,ఇటు టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎల్లమంద గ్రామంలో పర్యటించారు.. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై కూడా సమీక్ష జరిపారు.