CM Chandrababu: మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ.. ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిందే..!
- కేబినెట్ అనంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..
- రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారు..
- 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యం...
- పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం..
- మార్కాపురం, మదనపల్లి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి..
- రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడిన సీఎం, రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది అని తెలిపారు.
Read Also: Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఇక, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న చంద్రబాబు.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం అని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. పోలవరాన్ని జాతీయ గుర్తింపుతో తీర్చిదిద్దేందుకు, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. మరోవైపు,, రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం పేర్కొన్నారు. మార్కాపురం, మదనపల్లి మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా త్వరగా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, రాష్ట్ర పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమని చెప్పిన సీఎం చంద్రబాబు.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు.. ప్రజలకు సులభ సేవలు అందేలా వ్యవస్థను మారుస్తాం అని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
అమరావతి:
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!