Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..
- చట్టపరంగా న్యాయపోరాటం చేయడంలో తప్పేమీ లేదు: దానం నాగేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danam Nagender: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. తన ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు. చట్టపరంగా ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదని, అందుకే న్యాయపోరాటం చేశానని అన్నారు.
సుప్రీంకోర్టు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పిందని దానం నాగేందర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని, మళ్లీ ప్రజల మధ్యకు వెళ్తానని చెప్పారు. తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నానని, ఇకపై కూడా ప్రజాక్షేత్రంలోనే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు దానం నాగేందర్ స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేశానని, ఇప్పుడు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
బీఆర్ఎస్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ ప్రజలకు ఎవరు అండగా ఉన్నారో తెలుసని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించే వ్యక్తినని చెప్పారు. తాను గెలిచినా, ఓడినా ఖైరతాబాద్ ప్రజలు తనతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఒకసారి ఉప ఎన్నికలో ఓడిపోయానని దానం నాగేందర్ గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత తనకు రాజకీయంగా ప్రమోషన్ కూడా వచ్చిందని అన్నారు. ఖైరతాబాద్‌లోనే ఉండాలని, ఢిల్లీకి వెళ్లొద్దనే ఉద్దేశంతో తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని వ్యాఖ్యానించారు. తాను ఎంపీగా పోటీలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి భయపడ్డారా.? లేదా.? అన్నది ప్రజలకే తెలుసని అన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే పునరావృతమవుతాయని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అయితే తాను ప్రస్తుతం ఎలాంటి రాజకీయాలు మాట్లాడటం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు మార్గం సుగమమైన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!