AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ సమన్వయ కమిటీలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో కూటమి నేతలు తమ అభ్యర్థులతో కలిసి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు చంద్రబాబు..
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన దిశగా సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత, సమన్వయం కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
మేయర్ అభ్యర్థులపై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
మరోవైపు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం నగరాల మేయర్ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులు పోటీలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెండో జాబితా కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుండటంతో అభ్యర్థుల ప్రకటనపై ఆసక్తి పెరిగింది. అయినప్పటికీ, ఆయా నగరాలకు మేయర్ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. మేయర్ అభ్యర్థుల ఎంపికలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఎవరికి అవకాశం దక్కనుంది? అన్న అంశాలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండో జాబితా విడుదలతో ఈ ఉత్కంఠకు తెరపడుతుందా అన్నది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?