Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం
- కోటి వరకూ రుణం ఇస్తాం
- పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్‌గా ఏపీ మారుతుందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్‌గా ఏపీ మారింది. గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 100 పార్కులకు భూమి కేటాయించాం. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈలకు రూ.2.11 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. బ్యాంకులు కూడా వేగంగా రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నాం. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. కోటి వరకూ రుణం ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.’’ అని అన్నారు.
‘‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుంది. అధికార కార్యక్రమాలకు, ఫంక్షన్లకు, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు అంబేద్కర్ కళావేదిక. 4.43 ఎకరాల్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్. ఇంతవరకూ ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో, అమరావతిలోనూ లేదు. భారత ఆర్ధిక వ్యవస్ధ వెన్నెముక MSME రంగం. పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి MSME లకే ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం MSME. ఏపీలో నైపుణ్యం కల వారికి, అన్ని వనరులకు ఎలాంటి కొరత లేదు. MSME సమ్మిట్ 2026 అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుంది. 20.77 లక్షల MSME లు రాష్ట్రంలో ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక కోటి MSMEలు ప్రారంభించాలి. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులు వస్తాయి. జూలై నాటికి 175 MSME పార్కులు వస్తాయి. ఏపీలో రైతుల సహకారం అమోఘం. మన రాష్ట్రంలో రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. అమరావతికి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. మరో 17 వేల ఎకరాలు కూడా ఇస్తున్నారు. రైతులు, ప్రైవేటు వ్యక్తులు MSME లకు ముందుకు వస్తే ఇన్సెంటివ్‌లు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మీద నాకు నమ్మకం ఉంది. 50 వేల కోట్లు డ్వాక్రా రుణాలు తీసుకుని 99.9 శాతం చెల్లించారు.’’ అని తెలిపారు.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు