AP Cabinet Meeting: కీలక అజెండాతో కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రులు డుమ్మా..!
- 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ..
- రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ..
- ఏపీ కేబినెట్ భేటీకి దూరంగా ముగ్గురు మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయ్యింది.. మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్.. దీనిపై కేబినెట్లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్‌కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్.. ఈ రోజు కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు..
Read Also: MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్నందున.. కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు నారా లోకేష్.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేశారు మంత్రి నారా లోకేష్.. రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది.. దీని ద్వారా 2 వేల మంది వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరో రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయనుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్.. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్నందున మంత్రి సత్యకుమార్ యాదవ్.. కేబినెట్ భేటీకి హాజరుకాలేకపోయారు.. ఇక, సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉరవకొండలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఇవాళ్టి కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!