Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Alert to AP: ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రెండు తుఫాన్లు అతలాకుతలం చేశాయి.. ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటోంది భారత వాతావరణ శాఖ.. బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం దిశ మార్చుకుని తుఫానుగా మారే అవకాశాలపైనా వాతావరణ శాఖ పరిశీలన కొనసాగిస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా బలపడితే మరోసారి కోస్తాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వరుస వర్షాలు, తుఫానుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది.
తీరానికి సమీపంలో బలహీనపడే అవకాశం
ప్రస్తుతం సముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ కదలికలపై వాతావరణ నమూనాలు (మోడల్స్) భిన్నమైన అంచనాలు వెల్లడిస్తున్నాయి. సముద్రంలో తుఫానుగా బలపడినప్పటికీ, తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి బలహీనపడే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. అయితే తుఫానుగా లేదా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ తీరం దాటినా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడనం క్రమంగా బలపడితే గాలుల తీవ్రత, వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.
Also Read
- CII Partnership Summit: ఏపీ పారిశ్రామిక రంగానికి బూస్ట్.. 73 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు
- AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
- AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
- YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
కోస్తాంధ్రకు మరోసారి వర్షాల ముప్పు?
ఈ అల్పపీడనం తుఫానుగా మారితే కోస్తాంధ్రపై మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవస్థ తీరానికి చేరుకునే సమయంలో దాని తీవ్రత, ప్రయాణ దిశ ఆధారంగా వర్షాల ప్రభావం ఉండనుంది. అయితే తుఫాను తీరం దాటే సమయానికి బలహీనపడుతుందా? లేక తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందా? అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్లను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
-
Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!