Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ వైపు వాయుగుండం దూసుకొస్తుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని డీప్ డిప్రెషన్‌గా దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం సముద్ర పరిస్థితులు కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని IMD స్పష్టం చేసింది.
ఇక, వాయుగుండం నేపథ్యంలో అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని, ప్రభావిత జిల్లాల యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని సూచించారు. ముందస్తు సహాయక చర్యల కోసం అవసరమైన ప్రాంతాల్లో SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి రోడ్డు రవాణా, హెలికాప్టర్ సేవలను నియంత్రించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ట్రాలర్లు, బోట్లు, చిన్న నౌకల రాకపోకలకు ఇబ్బందులు, రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
కొండ వాలు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రాకపోకలను అవసరమైతే నియంత్రించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, హోర్డింగ్స్, పాత ఇళ్ల వద్ద ఉండకూడదని అధికారులు సూచించారు. విపత్తు పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపించాలని, విపత్తుల నిర్వహణ సంస్థ, RTGS అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని అధికారులు సూచించారు. వాయుగుండం కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!