ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also…