NTV Telugu Site icon

Balineni Meet Pawan Kalyan: కూటమి నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా..- బాలినేని

Balineni 1

Balineni 1

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారన్నారు. వైఎస్ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చానని.. వైఎస్ఆర్ మరణానంతరం మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచానని బాలినేని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని చెప్పారు.
తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు.. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు.

India-US: ఉగ్రవాది కేసులో భారత్‌ కు అమెరికా సమన్లు.. స్పందించిన విదేశాంగ శాఖ

విశ్వసనీయత అని ఎప్పుడు చెప్పే జగన్.. ఆయన కోసం రాజీనామాలు చేసి వచ్చిన 17 మందిలో ఒక్కరికైనా మంత్రి పదవి కొనసాగించారా అని బాలినేని ప్రశ్నించారు. వైఎస్ మీద ప్రేమతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైసీపీలోనే ఉన్నానని.. గతంలోనే పవన్ వైసీపీలో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలో చేరలేకపోయానని బాలినేని అన్నారు. ఏ డిమాండ్స్ లేకుండానే జనసేన పార్టీలో చేరుతున్నా.. కూటమి నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనసేనలో ఉన్న ప్రతీ కార్యకర్తను కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో జగన్‌ను ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కలిశానని.. రాజకీయాల్లో తన ఆస్తులు పోగొట్టుకున్నానని చెప్పారు.

Amaravati: ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం.. ఆక్రమణలను గుర్తించే పనిలో యంత్రాంగం

తాను వైసీపీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించటం తన క్యారెక్టర్ కాదని బాలినేని అన్నారు. వాళ్ళు తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే అందరి విషయాలు బయట పెడతానని తెలిపారు. ప్రజా తీర్పు మేరకు ఎమ్మెల్యే అయిన వ్యక్తికే అన్నీ హక్కులు ఉంటాయి.. తాను పవర్ కోసం పాకులాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. ఒక్క డిమాండ్ కూడా పవన్ ముందు ఉంచలేదు.. పవన్ ను కలవకముందే రాజీనామా చేసి వచ్చానని అన్నారు. వైఎస్ఆర్ కోసమే గతంలో అన్నీ ఇబ్బందులు భరించా.. బాధతో తన కళ్ళలో నీళ్ళు కూడా ఇంకిపోయాయని చెప్పారు. పార్టీలోని కోటరీ వల్లే పార్టీకి ఈ పరిస్థితి నెలకొందని సూచించారు. సమస్యలు ఏవైనా జగన్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన వ్యతిరేకంగా తీసుకున్నారు.. జనసేన పార్టీకి గట్టి నాయకులు వస్తానంటే తీసుకువస్తామని బాలినేని చెప్పారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సీఎం చంద్రబాబుకే లేఖ రాయడం జరిగిందని బాలినేని పేర్కొన్నారు.

Show comments